రాజ్ మరియు డికే ఈ ఇద్దరు వెబ్ సిరీస్ దర్శకుల హవా ప్రస్తుతం ఫుల్ గా కొనసాగుతోంది అని చెప్పవచ్చు. వీరిద్దరి దర్శకత్వంలో తెరకెక్కి ప్రముఖ 'ఓటిటి' అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'ది ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ ఎంత గొప్ప విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇండియా వైడ్ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా 'ది ఫ్యామిలీ మాన్ టు' ను కూడా తెరకెక్కించారు. దీనిని కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా జనాల నుండి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలా ఈ ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కించిన ది ఫ్యామిలీ మాన్  రెండు సీజన్ లు మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు వీరు దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ లకు ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ దర్శకులు చేస్తున్న వెబ్ సిరీస్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది.

ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు సాహిత్ కపూర్ నటిస్తుండగా, మరో కీలకపాత్రలో అమోల్ పాలేకర్ నటిస్తున్నాడు. ఇక వీరితో పాటు సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ సేతుపతి కూడా ఇందులో కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఇలా ఈ ముగ్గురు నటులలో ఎవరికి వారే ప్రత్యేకం అని చెప్పవచ్చు. వీరితో పాటే హాట్ బ్యూటీ రాశి కన్నా కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ వెబ్ సిరీస్ లో పాలు పంచుకోగా మరో క్రేజీ హీరోయిన్ రెజీనా కూడా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తుంది అని విశ్వసనీయ సమాచారం అందుతుంది. సౌత్ ఆడియన్స్ కు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న రెజీనా ఈ వెబ్ సిరీస్ లో నటించడం వల్ల ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం చాలా వరకు ఉంది. ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటికే రాశిఖన్నా నటిస్తున్నప్పటికీ రెజీనా కు దక్కాల్సిన ప్రాధాన్యత రెజీనా కు దక్కుతుంది అని చిత్రబృందం చెబుతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో రెజీనా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: