ఇప్పటికే మన దేశంలో కొంతవరకు కరోనా మహమ్మారి మెల్లగా తగ్గుముఖం పడుతున్న ఛాయలు కనపడుతున్నాయి. అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నప్పటికీ అదే వేగంతో ఎక్కడిక్కడ ప్రజలకు వ్యాక్సిన్స్ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకోగా మిగతా వారు కూడా మరికొన్నాళ్లలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇది మంచి పరిణామం అనే చెప్పాలి.

ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా వరకు తెరుచుకోవడంతో పాటు షూటింగ్స్ వేగంగా జరగడం అలానే పలు సినిమాలు ఇప్పటికే థియేటర్స్ లో విడుదలవడం చూస్తున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లోని థియేటర్స్ లో మాత్రం ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. త్వరలో దానిని కూడా తీసేసి ఫుల్ సీటింగ్ క్యాప్సిటీ పెట్టేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయట. అయితే మ్యాటర్ లోకి వెళితే ప్రతి ఏడాది మాదిరిగా రాబోయే సంక్రాంతికి కూడా ఇప్పటికే సర్కారు వారి పాట, బీమ్లా నాయక్, రాధేశ్యామ్ మూవీస్ రిలీజ్ కోసం బెర్త్ లు కన్ఫర్మ్ చేసాయి. అయితే వాటన్నిటికీ భారీ షాక్ ఇస్తూ నేడు ఆర్ఆర్ఆర్ మూవీ ని జనవరి 7న విడుదల చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కాగా ముందుగా భీమ్లా నాయక్, సర్కారు వారి పాట మూవీస్ నిర్మాతల నుండి అనుమతి తీసుకున్న తరువాతనే తమ సినిమా డేట్ ని ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించిదట. అలానే ఆ రెండు సినిమాలకు సంబంధించి త్వరలో లేటెస్ట్ రిలీజ్ డేట్స్ కానున్నట్లు టాక్. అయితే రాధేశ్యామ్ మాత్రం యధావిధిగా అనుకున్న టైం కి విడుదల కానుందని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే రాబోయే పొంగల్  వార్ పక్కాగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న భారీ మూవీ ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా దానయ్య ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో గ్రాండియర్ గా నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్, పూజా హెగ్డే లతో రాధాకృష్ణ తీసిన రాధేశ్యామ్ మూవీ యాక్షన్ తో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, దీనిని యూవి క్రియేషన్స్ వారు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: