అందాల ముద్దు గుమ్మ శాలిని పాండే, విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన అందంతో, తన నటనతో తన అభినయంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ వరుస సినిమా ఆఫర్లతో తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారుతుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ ముద్దు గుమ్మ అనుకున్నంత రేంజ్ లో ఆఫర్లను సాధించలేక పోయినప్పటికీ తెలుగులో మంచి సినిమా ఆఫర్ కొట్టేసింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించిన శాలిని పాండే, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఇలా సినిమాలతో  సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను, తన డైలీ ఆక్టివిటీస్ ను కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే అప్పు డప్పుడు శాలిని పాండే తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ తన అభిమానులను హిట్ ఎక్కిస్తూ ఉంటుంది, అయితే తాజా గా కూడా ఈ ముద్దు గుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో శాలిని బ్లాక్ కలర్ లో లో వైట్ కలర్ చారలు గల డ్రెస్ ను  దరించింది, శాలిని పాండే కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: