తెలుగులో సుమారుగా 400కు పైగా చిత్రాలలో కమెడియన్ పాత్రలలో నటించి తన కామెడీ నటనతో సినీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించినటువంటి తెలుగు ప్రముఖ సీనియర్ కమెడియన్ అలాగే మంచి నటుడు బాబు మోహన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన  పని లేదు.అయితే నటుడు బాబు మోహన్ కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి మొదటగా తెలుగు దేశం పార్టీలో చేరాడనీ తెలుస్తుంది ఆ తరువాత రాష్ట్రం రెండు విభాగాలుగా విడిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరాడనీ సమాచారం.. దీంతో ఐదేళ్లుగా మంత్రి పదవిని కూడా అనుభవించాడనీ కానీ ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం బాబు మోహన్ కి టికెట్ విషయంలో మొండిచెయ్యి చూపడంతో ఇటీవలే బిజెపి పార్టీలో చేరాడనీ తెలుస్తుంది.. రాజకీయాలలో బిజీ అయినప్పటి నుంచి నటుడు బాబు మోహన్ సినిమాలపై పెద్దగా దృష్టి సారించట్లేదట.అయితే తాజాగా బాబు మోహన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడనీ తెలుస్తుంది..


ఇందులో భాగంగా తాను తప్పులను అస్సలు సహించనని చెప్పినట్లు తెలుస్తుంది.అందువల్లనే తాను పదవిలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు పేద ప్రజల విషయంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తాను మాత్రం అస్సలు సహించకుండా కచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారట.ఈ క్రమంలో కొందరు అధికారులకు ఈ విషయం నచ్చక తన గురించి లేనిపోని ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడనీ తెలుస్తుంది. అలాగే తాను ప్రజలను చాలా సులభంగా నమ్ముతానని ఈ క్రమంలో కొందరు తనని మోసం చేయడానికి కూడా యత్నించారని తెలిపాడట.ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసేటటువంటి యాంకర్ మీ రాజకీయ జీవితంలో భాగంగా దాదాపుగా మూడు పార్టీలు మారి మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారంటూ ప్రశ్నించాడనీ సమాచారం.


  దీంతో బాబు మోహన్ ఈ విషయంపై స్పందిస్తూ తాను రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు స్వర్గీయ నటుడు మరియు నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరానని ఆ సమయంలో బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీకి చాలా సహాయం చేసిందని చెప్పారట.అప్పటి ప్రధాన అటల్ బిహారీ వాజ్ పై ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆ కారణంగానే తాను బిజెపి పార్టీలో చేరానని చెప్పుకొచ్చాడట. ఈ విషయం ఇలా ఉండగా నటుడు బాబు మోహన్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తన సినీ కెరీర్ ని వదులుకున్నాడనీ తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమ నుంచి బాబు మోహన్ దూరంగా ఉన్నప్పటికీ ఆయన నటించిన కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయనీ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: