టాలెంట్ ఉన్న దాన్ని సరిగా ఉపయోగించుకోలేక దర్శకుడిగా వెనుకబడి పోయాడు మెహర్ రమేష్. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ కూ డా ప్రేక్షకులను అలరింప చేయాలని చేసినవే. దురదృష్టవశాత్తు అవి బిగ్గెస్ట్ ఫ్లాప్ లు గా మిగిలిపోయాయి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా కంత్రి తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన శక్తి సినిమా గురించి చెప్పనవసరం లేదు. బిల్లా సినిమా పర్వాలేదు అనిపించుకుంది.

అయితే ఆ సినిమా తర్వాత చేసిన షాడో అయితే మొదటి షోకే భారీ ఫ్లాప్ అని తేలిపోయింది. దాంతో మెహర్ రమేష్ తో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు. దాంతో మంచి అవకాశం కోసం మంచి సమయం కోసం వేచి చూడాల్సి వచ్చింది మెహర్ రమేష్. అయితే ఆయన ఎదురు చూపులకు ఫలితంగా ఆయన పడిగాపులు కు సమాధానంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సినిమా అవకాశం ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాకు దర్శకుడిగా ఆయనను ఎంపిక చేశారు.

అయితే ఈ సినిమా వచ్చినప్పుడు మెహర్ రమేష్ల్ విమర్శించారు మెగా అభిమానులు. కానీ ఆయన సినిమా లు ఫెయిల్ అయిన దర్శకుడిగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కాబట్టే ఆయనకు ఈ అవకాశం ఇచ్చినట్లుగా మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైనప్ లో రీమేక్ సినిమాలు వరుసగా ఉన్నాయి. మొదట లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న చిరంజీవి ఆ తర్వాత వేదాలం రీమేక్  భోలాశంకర్ తెరకెక్కించాలి.  అయితే వరుసగా రీమేక్ సినిమాలు అవుతున్నాయి అని చెప్పి బాబీ సినిమా నీ ముందుకు తీసుకు వచ్చి భోళా శంకర్ సినిమా నీ కాస్త వెనక్కి జరిపాడట చిరు. మరి దీనిపై మెహర్ రమేష్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: