నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు, అఖండ సినిమాలో బాలకృష్ణ రైతుగా, అఘోర గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇది వరకే సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి, ప్రస్తుతం తెరకెక్కిన అఖండ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో మూడవది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, ఎట్టకేలకు  సినిమా పనులన్నీ ముగియడంతో ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

 ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది, దానిలో భాగంగా అఖండ బృందం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను 27 నవంబర్ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శిల్పకళా వేదిక, మాదాపూర్, హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియ జేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది, ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి, అయితే చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఆ వివరాలను ఏమీ తెలియకపోవడంతో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చే న్యూస్ పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి రానున్నట్టు తెలుస్తోంది . ఈ ఇద్దరు దర్శకులు బాలకృష్ణ తో తమ తదుపరి సినిమాలను తెరకెక్కించడానికి రెడీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: