ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లు విషయంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ టికెట్ విధానానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతేకాకుండా ఎలాంటి సినిమా అయినా సరే ప్రతిరోజు కేవలం నాలుగు షో లు మాత్రమే వేసుకోవాలని ఆంక్షలు విధించింది. అయితే జగన్ ఈ విషయంపై మాట్లాడుతూ ఇది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గా తెలియజేశారు. ఫ్యాన్సీ షో , బెనిఫిట్స్ వంటివి ఇక మీదట ఉండవని తెలియజేసింది. అన్నిటికి ఒకటే రేట్ ఉండేలా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


అయితే  వీటిపై ఇప్పటికే పలువురు సినీ హీరోలు సైతం తన ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై మరొకసారి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది అని కొంతమంది విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక్క రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో సైతం ఉన్నట్లుగా ధరలను నిర్ణయిస్తే బాగుంటుందనే విన్నపాలు కూడా ఇచ్చారు మన స్టార్స్. అయితే వీటిపై తాజాగా నిర్మాత సురేష్ బాబు స్పందించడం జరిగింది.


ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల ధరల వల్ల నిర్మాతలు చాలా అలా ఇబ్బందులు పడతారని, ఈ విషయంపై మరొకసారి ప్రభుత్వం ఆలోచిస్తే మేలు అని తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు సినిమా చూడడానికి థియేటర్లకు చూడడానికి చాలా కష్టం. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నిర్మాతలకు భారీ నష్టాలు వస్తాయని తెలియజేశారు. అసలు సినిమాని కూడా విడుదల చేయలేరని తెలియజేశారు.

ఇక B,C, వంటి సెంటర్లలో కనీసం థియేటర్ల కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే థియేటర్లన్నీ మూసుకోవలసిందే అని తెలిపారు. మార్కెట్లో దొరికే ఒకే వస్తువు పలురకాలుగా రేటు ఉంటుందని.. అలాంటప్పుడు అన్నింటికీ ఒకే రేటు అంటే ఎలా అని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలు ఎలాగోలాగా గట్టెక్కుతాయి. పెద్ద సినిమాలు చాలా ఇబ్బంది పడతాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: