టాప్‌ హీరోలని డామినేట్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు వాళ్ల ఇమేజ్‌ని పోల్చుకోవడనికి కూడా చాలా కష్టమని సినిమా వర్గాలు అంటుంటాయి. అయితే రజినీకాంత్ అల్లుడు ధనుష్‌ మాత్రం ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు. భాషే తెలియని బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ తన హవా సృష్టించాడు. ఏకంగా అక్కడి స్టార్స్‌ని డామినేట్ చేస్తున్నాడు. టాప్ హీరోలని కేవలం సపోర్టింగ్‌ రోల్స్‌కి పరిమితం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ధనుష్.

ధనుష్‌కి తమిళనాట సూపర్ ఇమేజ్‌ ఉందే విషయం అందరికీ తెలుసు. ఎలాంటి క్యారెక్టర్‌ అయినా హండ్రెడ్‌ పర్సంట్‌ బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడనే ఒపీనియన్‌ ఉంది. దీనికి తగ్గట్టుగానే 'అసురన్'తో బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు ధనుష్. ఈ పెర్ఫామెన్స్‌తోనే బాలీవుడ్‌ స్టార్స్‌కి పోటీ ఇస్తున్నాడు. హిందీ సినిమాల్లో హిందీ స్టార్స్‌ని డామినేట్ చేస్తున్నాడు.

ధనుష్‌ చాన్నాళ్ల తర్వాత హిందీలో నటించిన సినిమా 'అత్‌రంగీ రే'. ఆనంద్‌.ఎల్.రాయ్ దర్శకత్వంలో ధనుష్, సారా అలీ ఖాన్ జంటగా నటించారు. ఈ మూవీలో అక్షయ్‌ కుమార్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయింది. అయితే బాలీవుడ్‌ సూపర్‌స్టార్ అక్షయ్‌ కంటే ధనుష్‌ పెర్ఫామెన్స్‌ గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

అమితాబ్ బచ్చన్‌ కటౌట్‌ ముందు ఎంత పెద్ద స్టార్ అయినా సైడ్‌ అయిపోతాడు. కానీ 'షమితాబ్‌' సినిమాలో బిగ్‌బిని తట్టుకుని నిలబడ్డాడు. బెస్ట్‌ పెర్ఫామెన్స్‌తో ప్రశంషలు అందుకున్నాడు. దీంతో ధనుష్ హిందీ ఇండస్ట్రీకి వెళ్లి హిందీ సినిమాల్లో నటిస్తూ హిందీ స్టార్స్‌కి పోటీ ఇస్తున్నాడని తమిళ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.


ధనుష్ పేరు చెప్పగనే ఆయన ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. సరిలేవరు మా హీరోకు అంటూ కేరింతలు కొడుతున్నారు. ఆయన సినిమాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. డైలాగ్ డెలివరీలో మామయ్యకు తీసిపోని విధంగా ప్రతిభ చాటుతూ అభిమాన లోకాన్ని అలరిస్తున్నాడు ధనుష్.


 



మరింత సమాచారం తెలుసుకోండి: