ఒక బాషలో విజయాన్ని సాధించిన చాలా చిత్రాలు ఇతర భాషల్లోనూ డబ్ చేయడం అనేది సాధారణంగా జరిగేది. చాలా సినిమాలో ఇదే తరహాలో ఒక భాష నుండి మరో భాషలోకి అనువాదం చేస్తుంటారు. అలా వచ్చిన చిత్రాలు చాలా వరకు విజయాన్ని అందుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'రాజు రాణి ' సినిమా ఒకటి. తమిళ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ మంచి హిట్ నే అందుకుంది ఈ మూవీ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కాగా ఒకరు నయనతార మరొకరు నజ్రియా.

బేసిక్ గా ఈమె ఒక మలయాళ నటి. అయితే ఈ సినిమాతో ఆమె ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు తమిళ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత ఈమె తమిళ్ లో వరుసగా చిత్రాలలో కూడా నటించారు. అయితే ఈమె కెరియర్ ఫామ్ లో ఉన్న  సమయం లోనే పెళ్లి చేసుకుని సినిమాలను మెల్లగా తగ్గించారు. 'బెంగుళూర్ డేస్' అనే మలయాళ  సినిమాలో ఈమె హీరోయిన్ గా చేయగా , హీరోగా నటుడు ఫహద్ ఫాజిల్ చేశారు. ఆ సమయం లోనే వీరి మధ్య ప్రేమ మొదలయ్యింది.  వీరి ప్రేమ బందాన్ని పెళ్లి బంధంతో మరింత దృఢం చేసుకున్నారు హీరోయిన్ నజ్రియా.

సినిమా 2014 లో రిలీజ్ కాగా అదే ఏడాది ఆగస్టు 21, 2014 లో వీరు వివాహం చేసుకున్నారు. అలా ఆ సినిమాలో భార్య, భర్తల పాత్రల్లో హీరో హీరోయిన్లు గా చేసిన వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా పెళ్ళిచేసుకుని ఒకటయ్యారు. ఈ రోజు నజ్రియా తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇలాగే కలకాలం వీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: