డైరక్టర్ అవ్వాలని హీరో అయిన వారిలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నానిసినిమా నుండి తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండ్డా సినిమాల మీద ఇష్టంతో సెల్ఫ్ మేడ్ హీరోగా నాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. నాని ప్రస్తుతం కలకత్తా బ్యాక్ డ్రాప్ కథతో శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మించారు. మూవీలో మళయాళ భామ సాయి పల్లవి, బెంగుళూరు బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు డిఫరెంట్ రోల్స్ తో నాని మెప్పిస్తాడని తెలుస్తుంది. శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ హంగామా మొదలైంది. హైదరాబాద్ దేవి థియేటర్ దగ్గర నాని 63 అడుగుల కటౌట్ పెట్టి ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

నాని నటించిన వి, టక్ జగదీష్ రెండు సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి. నాని సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం రెండేళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకే నాని ఏ సినిమాకు లేని జోష్ శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ టైం లో కనిపిస్తుంది. తెలుగుతో పాటుగా శ్యాం సింగ రాయ్ సినిమాను తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను మ్యాక్సిమం ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు చిత్రయూనిట్. నాని మాత్రం ఈ మూవీపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ క్రిస్ మస్ మనదే అని సినిమాకు చేసిన ప్రతి ఈవెంట్ లో చెబుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాడు. మరి నిజంగానే ఈ క్రిస్ మస్ నానిది అవుతుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: