ప్రభాస్ రాధే శ్యాం సినిమా మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు పడ్డారు మేకర్స్. ఈ సినిమా హిందీ వర్షన్ వరకు నలుగురు మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేయగా తెలుగు పాటల కోసం మాత్రం జస్టిన్ ప్రభాకరన్ పనిచేశారు. అయితే సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఈమధ్యనే థమన్ ను తీసుకున్నారు. అయితే థమన్ ను ఎనౌన్స్ చేయడ్డం రీసెంట్ గా చేశాం కాని 40 రోజుల ముందు నుండి థమన్ రాధే శ్యాం కోసం వర్క్ చేస్తున్నారని డైరక్టర్ రాధాకృష్ణ చెప్పారు.

అయితే థమన్ పెట్టిన బాధ్యతని అదరగొట్టే రేంజ్ లో చేస్తున్నాడని చెప్పారు. సినిమాలో థమన్ మ్యూజిక్ పక్కాగా చెప్పాలంటే లేపి అవతల పడేస్తున్నాడని అంటున్నారు. ఈమధ్య థమన్ మ్యూజిక్ ముఖ్యంగా బిజిఎం విషయంలో చితక్కొట్టేస్తున్నాడు. ఇటీవల రిలీజైన అఖండ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లా ఉందని అంటున్నారు.

ప్రభాస్, పూజా హెగ్దేల ప్రేమ కావ్యానికి థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. టాలీవుడ్ లో ప్రాతుతం థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యుజిషియన్ గా థమన్ ఫుల్ ఫాం లో ఉన్నాడు. సినిమా సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దుమ్ము దులిపేస్తున్నాడు. అయితే రాధే శ్యామ్ సినిమా క్రేజీ లవ్ స్టోరీగా వస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. గ్రాండియర్ విజువల్స్ కి సరిపడే బిజిఎం ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్తుంది. సంక్రాంతి రేసులో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా పడగా.. రాధే శ్యామ్ ఒక్కటే పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధే శ్యామ్ తో ప్రభాస్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.  బాహుబలి తర్వాత సాహో నిరాశపరచగా రాధే శ్యామ్ తో లెక్క సరిచేయాలని చూస్తున్నాడు ప్రభాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: