ఇప్పటికే ఈసినిమా విడుదల నాలుగు సార్లు వాయిదా పడింది. అయినప్పటికీ ఈమూవీ పై ఉన్న క్రేజ్ తో ఈమూవీ మార్కెట్ ఎక్కడా దెబ్బ తినలేదు. కరోనా వ్యతిరేక పరిస్థితులలో కూడ ఈమూవీ విడుదలైతే చాలు బాక్స్ ఆఫీసు దద్దరిల్లేలా కలక్షన్స్ వర్షం కురిపించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఇలాంటి అంచనాలతోనే రాజమౌళి మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తన మూవీని సంక్రాంతికి వారం రోజులు ముందుగా విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో ప్రచారం మొదలు పెట్టాడు.
దీనికోసం అప్పటికే సంక్రాంతి రిలీజ్ ను ఫిక్స్ చేసుకున్న అన్ని భారీ సినిమాలను ఒకొక్కటిగా తెలివిగా వాయిదా వేయించాడు. చివరకు ఒమైక్రాన్ పరిస్థితులతో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి ఆఖరి నిముషంలో తన మూవీని వాయిదా వేసుకోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని చాలామందికి అసహనం కలిగిస్తోంది. ఇప్పుడు మళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రస్తుత పరిస్థితులు చక్కపడ్డాక ఏప్రియల్ మొదటి వారంలో విడుదల చేయడానికి రాజమౌళి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉండటంతో ఇండస్ట్రీలోని చాలామంది రాజమౌళి తీరు పై అసహనాన్ని వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోతున్న ఏప్రియల్ లో పాన్ ఇండియా మూవీలు ‘కేజీ ఎఫ్ 2’ తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘బీస్ట్’ లతో పాటు దిల్ రాజ్ ‘ఎఫ్ 3’ కూడ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏప్రియల్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అంటే తమ భారీ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ రాజమౌళి కోసం ఎన్ని సార్లు త్యాగాలు చేయాలి అంటూ చాలామంది దర్శక నిర్మాతలు గగ్గోలు పెడుతున్నట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి