నేటి బాల నటులే రేపటి ఫ్యూచర్ స్టార్లు అని అందరూ అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో బాల నటులుగా సత్తా చాటి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారు ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

ఒకప్పుడు బాల నటులుగా నటించిన పూరి ఆకాష్ మరియు తేజ సజ్జ లు ఇక ఇప్పుడు హీరోగా బాగా రాణిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ వారు దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నానీ అనే సినిమా అందరికీ ఎక్కువగా గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయిందట.. కానీ మహేష్ బాబు కెరీర్ లో మాత్రం ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా నాని సినిమా నిలిచింది అని అందరూ చెప్పుకుంటారు.

అయితే నాని సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు కూడా ఉర్రూతలూగిస్తున్నాయి.ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ మంచి మ్యూజిక్ అందించారు. ఇక ఎన్నో రోజుల పాటు నాని సినిమాలోని పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన అబ్బాయి దాదాపు ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండే ఉంటారు.

ఇలా ఒకప్పుడు హీరో ఫ్రెండ్ గా బాలనటుడి గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అబ్బాయికి ఇప్పుడు హీరోగా మారిపోయాడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఆ హీరో వచ్చేశాడు. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా. ఎవరో కాదు మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన అశోక్ గల్లా. ఇటీవల 'హీరో' అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు అశోక్ గల్లా. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అశోక్ గల్లా మీడియా సమావేశంలో చైల్డ్ ఆర్టిస్టుగా తాను చేసిన రెండు సినిమాల గురించి బాగా గుర్తు చేసుకున్నారు.బాల నటుడి గా తన మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి తో చేశాను అంటూ చెప్పుకొచ్చారట అశోక్ గల్లా.
ఇక తాను బాల నటుడిగా మొదటి సినిమా చేస్తున్న సమయంలో కనీసం తనకు ఇండస్ట్రీ పైన ఏ మాత్రం కూడా అవగాహన లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నాని సినిమా చేసే సమయానికి మాత్రం షూటింగ్ ఎలా ఉంటుంది అన్న విషయం కాస్త తెలిసి వచ్చిందని అంటూ అశోక్ గల్లా చెప్పుకొచ్చారట.. ఇక ఆ తర్వాత చదువుకుంటున్న సమయంలో సినిమాలపై షూటింగ్ పై పూర్తి అవగాహన తెచ్చుకున్నానని అంటూ అశోక్ గల చెప్పుకొచ్చాడట . ఇక మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న ఈ హీరో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా రాణిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: