భారత చలనచిత్ర పరిశ్రమలో ఏంతో మంది వివిధ నేపథ్యం నుంచి వచ్చిన నటి నటులు ఉన్నారు. అలాగే కొందరు అయితే ప్రముఖ రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన వారు కూడా ఈ సినీ గ్లామర్ పట్ల ఆకర్షితులై రాగా మరికొందరు తమ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అడుగుపెట్టిన విషయం విధితమే, అలాగే, ఇంకొందరు అయితే ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే చిత్ర నిర్మాతలు , దర్శకులు ఇచ్చిన అవకాశాలు కారణంగా అడుగుపెట్టిన వారు. 

 

చివరి కోవకు చెందిన వారిలో ఏంతో మంది బాలీవుడ్ నుండి మొదలు కొని అన్ని భాషల పరిశ్రమలో ఉన్నారు. బాలీవుడ్ తర్వాత అత్యాధికంగా దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో ని శాండిల్ వుడ్ , కోలీవుడ్ లలో హీరోలుగా ఉన్నారు. అలాంటి వారి లో ఆ హీరో తన మొదటి చిత్రంతో నే అతి పెద్ద విజయాన్ని నమోదు చేశాడు, ఇంతకీ ఎవరూ ఆ హీరో తెలుసా ? అతని గురించి తెలుసుకోవాలని ఉందా అయితే చదవండి. 



అరవింద్ స్వామి ... దక్షిణాది సిని పరిశ్రమలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, 90వ దశకంలో అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసిన కలల రాకుమారుడిగా, వారి హార్ట్ త్రోబ్ గా నిలిచిన రొమాంటిక్ హీరో. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రోజా , బొంబాయి వంటి అద్భుతమైన కళాఖండాలు లాంటి పాన్ ఇండియన్ మూవీస్ లో నటించిన ఘనత తన తరం హీరోల్లో ఇతనికే దక్కింది.  



అరవింద్ స్వామి తమిళనాడు రాజధాని చెన్నై లో ఉన్న ఒక ప్రముఖ సంపన్న వ్యాపార కుటుంబంలో  జన్మించారు. తల్లిదండ్రులు వి.డి.స్వామి , వసంత లు. తల్లి వసంత గారు భారత నాట్యం లో ప్రముఖ నృత్యకారిణి కాగా తండ్రి వి.డి.స్వామి ప్రముఖ వ్యాపారవేత్త మరియు గొప్ప వితరణ శీలి . రామేశ్వరం వద్ద నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో పాలుపంచుకున్న కావేరీ ఇంజినీరింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు. అలాగే, ప్రముఖ కంటి వైద్యశాల శంకర్ నేత్రాలయా సంస్థ యొక్క వ్యవస్థాపకుడు.  




స్వామి చెన్నై లోని లయోల కళాశాలలో బీకాం మరియు అమెరికా లోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. చెన్నైలో బీకాం చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేశావాడు. ఒక మోడలింగ్ షో లో చూసిన మణిరత్నం తన దళపతి చిత్రంలో అవకాశం ఇవ్వగా మొదట సంశయంచిన తరవాత ఒకే చెప్పడంతో తన సినీ కెరీర్ మొదలైంది. 



దళపతి చిత్రం లో రజినీకాంత్ , మమ్ముట్టి హీరోలుగా ఉన్నప్పటికీ అరవింద్ కు సైతం మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా లో అరవింద్ మెయిన్ హీరోగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేయడం జరిగింది. రోజా తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చిన ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ నటించిన అరవింద్ తన తండ్రి వ్యాపారాల్లో సైతం క్రియాశీలకంగా వ్యవహరించేవారు. 



తన తల్లిదండ్రుల మరణాంతర పరిస్థితుల్లో సినిమాలకు దూరంగా ఉంటూ తమ వ్యాపారాల్లో బిజీగా ఉంటూ వచ్చిన అరవింద్ విజయవంతమైన వ్యాపారవేత్త గా రాణించారు. తమ తల్లిదండ్రులు ఇచ్చిన అస్థితో పాటుగా వ్యాపారవేత్త గా తనే స్వయంగా వ్యాపారంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆర్జించారు అని వెల్లడైంది. వ్యాపారవేత్త గా ఉన్న సమయంలోనే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 4 సంవత్సరాలు మంచానికి పరిమితం అయిన వ్యాపారాలను మాత్రం పర్యవేక్షణ చేస్తూ విజయవంతంగా నడిపించారు. 



గాయాన్ని నుంచి కోలుకున్న తర్వాత మణిరత్నం పిలుపు మేరకు తిరిగి సినిమాల్లోకి ప్రవేశించి నటించడం మొదలు పెట్టిన అరవింద్  తని ఒరువన్ (తెలుగు లో వచ్చిన ధృవ చిత్రం మాతృక) చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకొని మరోసారి నటుడిగా తన సత్తా నిరూపించారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రస్తుతం వరకు ఉన్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు అరవింద్ పారితోషకం 6-7 కోట్ల రూపాయలు ఉంటుంది. 



నటుడిగా ఉంటూనే తన వ్యాపారాలను సైతం పలు రంగాల్లో విస్తరణ చేశారు .ప్రస్తుతం అరవింద్ కు ఆస్తి విలువ కొన్ని వేల  కోట్ల రూపాయలు అంతే కాకుండా దేశ , విదేశాల్లో పలు కంపెనీల్లో భాగస్వామ్యం ఉంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత సంపన్న నటుడు అరవింద్ స్వామి .   

మరింత సమాచారం తెలుసుకోండి: