టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారిగా రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా పరిచయం అయిన మహేష్ ఫస్ట్ మూవీతోనే ఎంతో పెద్ద సక్సెస్ అందుకుని తండ్రి కృష్ణకి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. అక్కడి నుండి అనేక సినిమా అవకాశాలు అందుకుని పలు ఇండస్ట్రీ హిట్స్ తో పాటు అక్కడక్కడా కొన్ని ప్లాప్స్ కూడా చవి చూసిన మహేష్, తన ఆకట్టుకునే అందం అత్యద్భుత అభినయంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.

తన కెరీర్ లో ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ కొనసాగిన మహేష్ టాలీవుడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. ఇక ఇటు కేవలం తెలుగులోనే కాక బాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా మహేష్ కి మంచి క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా తన కెరీర్ లో కేవలం స్పైడర్ వంటి ద్విభాషా మూవీ మాత్రమే చేసిన మహేష్ అనేకమంది బాలీవుడ్ ప్రేక్షకుల అలానే సినిమా ప్రముఖుల ప్రేమాభిమానాలని పొందారు. బాలీవుడ్ లో అనేకమంది హీరోయిన్స్ మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్స్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక అటు తమిళ్ లో కూడా సూపర్ స్టార్ కి సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు అక్కడ బాగా కలెక్షన్స్ రాబట్టాయి. అలానే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ హిందీ సినిమాలు చేయాలని అక్కడి ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుతున్నారు. ఇవి మాత్రమే కాక అటు మలయాళం, కన్నడలో కూడా మహేష్ కి సూపర్ క్రేజ్ ఉంది. మొత్తంగా ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకుండానే హీరోగా అన్ని భాషల్లో కూడా సూపర్ క్రేజ్ తో దూసుకెళ్తున్నారు మహేష్. ఇక రాబోయే రోజుల్లో రాజమౌళితో ఆయన చేయనున్న పాన్ ఇండియా సినిమా తరువాత సూపర్ స్టార్ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తుకి చేరడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: