యంగర్ రెబల్ స్టార్ కెరీర్‌లో డ్రాస్టిక్‌ చేంజెస్‌ తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. 'ఛత్రపతి'తో ప్రభాస్‌కి మాస్‌ ఫాలోయింగ్‌ పెంచిన జక్కన్న 'బాహుబలి'తో పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ తీసుకొచ్చాడు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అంతా రాజమౌళి మళ్లీ మా హీరోతో ఎప్పుడు సినిమా తీస్తాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకి తెరదించుతూ ఒక భారీ ప్లాన్‌ ఉందని, సమయం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని సెట్స్‌కి తీసుకెళ్తామని చెప్పాడు ప్రభాస్.

నేషనల్‌ లెవల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ సాధించిన రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే భారీ బిజినెస్‌ జరిగే అవకాశముంది. అయితే జక్కన్న 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత మహేశ్‌ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో జక్కన్న సినిమా ఉంటుందని అంటున్నారు.  సో ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక రాజమౌళి, ప్రభాస్ ప్రాజెక్ట్‌ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది.

మాస్‌ మూవీస్‌తో హంగామా చేసే జూ.ఎన్టీఆర్‌ని సెటిల్డ్‌గా చూపించిన సినిమా 'జనతాగ్యారేజ్'. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అప్పుడు తెలుగు మార్కెట్‌నే ఫోకస్‌ చేసిన తారక్, కొరటాల ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ని టార్గెట్ చేశారు. వీళ్లిద్దరి కాంబోలో మల్టీలింగ్వల్‌ మూవీ తెరకెక్కబోతోంది.

అల్లు అర్జున్‌ గ్రాఫ్‌ని టర్న్‌ చేసిన డైరెక్టర్ సుకుమార్. 'ఆర్య' సినిమాతో బన్నిని స్టైలిష్‌గా ప్రజెంట్‌ చేసిన సుక్కు, 'పుష్ప' తో ఈ హీరోకి పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ తీసుకొచ్చాడు. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప-ది రైజింగ్'తో బన్ని హిందీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు. కేవలం హిందీ బెల్ట్‌లోనే 'పుష్ప-1' వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో 'పుష్ప' పార్ట్‌2 వస్తోంది.

పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న 'లైగర్‌' సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్‌ ఉంది. మైక్‌ టైసన్ స్పెషల్‌ రోల్ ప్లే చేస్తున్నాడు అనే అనౌన్స్‌మెంట్‌ రాగానే, బాలీవుడ్‌ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తోంది. సెట్స్‌లో ఉండగానే ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు అందుకున్న 'లైగర్‌' తర్వాత పూరీ, విజయ్‌ కాంబోలో మరో సినిమా రాబోతోంది. పూరీ జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్ 'జనగణమన'. టాలీవుడ్‌లో పాన్‌ ఇండియన్ మార్కెట్‌ గురించి పెద్దగా చర్చల్లేని టైమ్‌లోనే ఈ కథని పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో తియ్యాలనుకున్నాడు. మహేశ్‌ బాబుతో ఈ సినిమా తీస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే పూరీ, మహేశ్‌ మధ్య ఈక్వేషన్స్‌ మారాక 'జనగణమన' హీరో కూడా మారిపోయాడు. విజయ్‌ దేవరకొండతో పూరీ 'జనగణమన' చేస్తాడని తెలుస్తోంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: