టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల చందమామ కాజల్ మమ్మీ కాబోతున్న సంగతి తెలిసిందే. 2022 `మే`లో డెలివరీ ఉంటుందని డేట్ కూడా చెప్పేసింది. ఆమె అమ్మ అవుతున్న ఆనందంలో ఉన్నానని కాజల్ సోషల్ మీడియాల్లో రకరకాల మార్గాల్లో వెల్లడిస్తూనే ఉంది.కాజల్ అగర్వాల్ తన చిరకాల ప్రియుడు అయిన గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఆచార్య .. ఇండియన్ 2 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాను గర్భవతిని అని ఇటీవల ఆమె ప్రకటించింది. గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి దుబాయ్ లో ఉంటుంది. తాను గర్భిణిగా ఉన్న తర్వాత కూడా కాజల్ తరచుగా ఫోటో షూట్ లను అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ ఉంది.ఇక 30 ఏళ్లు పైబడిన కానీ మైనపు విగ్రహంలా కనిపించే ఈ అందానికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ప్రకటనల కోసం కంపెనీలు బాగా వెంటపడుతున్నాయి. కాజల్ అగర్వాల్ ఇటీవల తన చెల్లెలు కొడుకు ఇషాన్ వాలెస్ తో కలిసి ఓ ప్రకటనలో నటించింది.



ఇక ఆ యాడ్ లో కాజల్ బరువు పెరిగి ముఖం పెద్దదిగా కనిపించింది. ఇక ఫలితంగా ప్రస్తుతం ఒక ప్రకటన కోసం పోజులిచ్చినట్లు కనిపించింది. అందులో ఈ బెడ్ ప్రెగ్నెన్సీ సమయంలో తనకు చాలా సౌకర్యంగా ఉంటుందని ఇంకా గర్భిణులందరూ అనువైనదని కితాబిచ్చేసింది.అలాగే కాజల్ తాజా ఫోటోషూట్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం అమ్మ కాబోతున్న తన ఫీలింగ్స్ ని కూడా కాజల్ అగర్వాల్ బయటపెట్టింది.అన్నీ మన చేతుల్లో ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ అదే సమయంలో మనసంతా గజిబిజిగా మారిపోతుంది.ఇక ఎప్పుడు ఏమి చేస్తున్నామో.. ఏమి చేయాలో తెలియకుండానే సమయం అనేది గడిచిపోతుంటుంది. మన పిల్లలను జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ భావోద్వేగపు బంధంలో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం అంటూ తన మనసును ఆవిష్కరించింది. కాజల్ అగర్వాల్ తాజా ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీ సన్నిహితులు సహా అభిమానులు కూడా దీనిపై స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: