‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ ల హడావిడి పూర్తి అవ్వడంతో ఈ నెలాఖరులో రాబోతున్న ‘ఆచార్య’ హంగామా కోసం ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా మెగా అభిమానులు కూడ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన ‘సైరా’ తన అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేక పోవడంతో చిరంజీవి తన పాత మార్గాన్ని అనుసరిస్తూ ‘ఆచార్య’ లో నటించాడు.



ఈ మూవీలో డ్రామా శాతం చాల ఎక్కువగా ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ఈ సినిమా పాత పద్ధతిలో తీసిన రొటీన్ సినిమాగా మాత్రంగానే మిగులుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ పబ్లిసిటీలో కొత్త విధానాలు అనుసరిస్తూ సినిమా పై ఆశక్తిని పెంచుతున్నారు.



అయితే ‘ఆచార్య’ ప్రమోషన్ కూడ పాత పద్ధతిలోనే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో చిరంజీవి మాట్లాడుతూ తనను చరణ్ డామినేట్ చేస్తాడేమో అని భయపడ్డానని అని అనడం దానికి సమాధానంగా చరణ్ తాను జీవితంలో డాడీని డామినేట్ చేయలేను అని అనడం చూసేవారికి ఈమూవీ పాత పద్ధతిలోనే ప్రమోట్ కాబడుతోందా అన్న సందేహాలు రావడం సహజం.



ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన పాటలు కూడ రెగ్యులర్ ట్యూన్స్ లానే ఉన్నాయి. దీనికితోడు ఈ సినిమా కథ అంతా నక్సలైట్ ఉద్యమం నేపధ్యంలో ఉంటుంది అని లీకులు ఇస్తూ మధ్యలో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్న చిరంజీవి ఐటమ్ సాంగ్ లో నటించడం ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. దీనితో రెగ్యులర్ ఫార్మెట్ లో ఉండబోతున్న ఈమూవీని కనీసం డిఫరెంట్ గా ప్రమోట్ చేసే అవకాశం కోరతాలకు ఇవ్వకపోతే కొరటాలకు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళికి వచ్చిన కష్టాలు తప్పవా అంటూ కొందరి కామెంట్స్. త్వరలో జరగబోతున్న ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధి గా ఎవరు వస్తారు అన్న విషయం పై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: