సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది. సర్కార్ వారి పాట మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36.01 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన లిస్ట్ లో 5 వ స్థానంలో నిలిచింది. సర్కారు వారి పాట సినిమా కంటే ముందు ఉన్న నాలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.11 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.


బాహుబలి 2 : ప్రభాస్,  అనుష్క హీరో , హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.


సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార , తమన్నా హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 38.75 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.


సహో : ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 36.52 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: