మొన్నటివరకు బిగ్బాస్ కార్యక్రమం అంటే కేవలం బుల్లితెర పైన  ప్రసారమయ్యేది అనుకున్నారూ. కానీ ఇటీవలే బిగ్ బాస్ ఓటిటి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక గంట సేపు ఎపిసోడ్ కాదు 24 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ప్రేక్షకులు అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఓటిటీ తెలుగు కార్యక్రమం ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్బాస్ చరిత్రలోనే మొదటి సారి ఫిమేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి రికార్డు సృష్టించింది.  హౌస్ లోకి వెళ్ళిన నాటి నుంచి ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేసిన బిందుమాధవి చివరికి అన్ని ఎలిమినేషన్స్ దాటుకుంటూ వచ్చి ఇక ఇప్పుడు విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో బిందుమాధవి ఆడపులి గా పేరు తెచ్చుకుని విన్నర్గా నిలవడంతో ఎంతోమంది మహిళలు హర్షం వ్యక్తం చేశారు అని చెప్పాలి. అంతే కాదు కేవలం మెయిల్ కంటెస్టెంట్స్ విన్ అయ్యేలా బిగ్బాస్ నిర్వాహకులు ఓట్లు తారుమారు చేస్తున్నారు అనే అపవాదు కూడా ప్రస్తుతం బిందు మాధవి బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో  తొలగిపోయింది అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ ఓటిటీ సీజన్ ముగిసిన తర్వాత అందరు కంటెస్టెంట్ లు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ బిందుమాధవి కూడా అభిమానుల తో చిట్ చాట్ చేసిన బిందుమాధవికీ ఒక ఆశక్తికర ప్రశ్న ఎదురయింది. నువ్వు బాత్రూంలో స్మోకింగ్ చేస్తున్నావని శ్రవంతి అఖిల్ తో పాటు అతడి ఫ్రెండ్స్ కి చెప్పింది. ఇది నిజమేనా అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా. M లేదండీ నాకు స్మోక్ చేసే అలవాటు లేదు ఒకవేళ తనకు అలాంటి అలవాటు ఉండి ఉంటే బాత్రూంలోకి వెళ్లి చేయడం కాదు కెమెరా ముందే చేసేదాన్ని అని అంటూ బిందు మాధవి చెప్పింది. దీంతో ఇన్నాళ్ల పాటు బిందు మాధవి కూడా బాత్రూంలో స్మోకింగ్ చేసింది అంటూ అనుకుంటున్న వారికి ఈ మాటతో ఒక క్లారిటీ వచ్చింది అది చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: