సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం f-3 ఈ సినిమా విడుదలకు సర్వం సిద్ధం గా ఉన్నది. F-2 చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రం కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా థియేటర్లో నవ్వులు పూజించడానికి ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో వెంకటేష్ ,వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు ఇందులో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో నటిస్తూండగా పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ఇక హీరోయిన్లు గా మాత్రం తమన్నా మెహరీన్ నటిస్తున్నది.


ఇప్పటికి ఎఫ్ త్రీ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించాయి. అలాగే చిత్రబృందం ఇప్పటివరకు వరుస ఇంటర్వ్యూ లతో ఈ సినిమా మంచి హైఫ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల చేశారు. హత్ మే పైసా.. సాంగ్ ఎప్పుడు బాగా వైరల్ గా మారుతుంది. పార్టీ  కలర్ఫుల్ గా డిజైన్ చేయబడిన ఈ పాట ప్రస్తుతం చాలా ట్రెండీగా అవుతోంది. ఈ పాటని సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు.

ఇక ఈ వీడియోలో వరుణ్ తేజ్, వెంకటేష్  తో కలిసి పూజా హెగ్డే స్టెప్పులు చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ స్టైల్ లో ఈ సినిమా లోని డాన్స్ చాలా హైలెట్ గా నిలుస్తోంది. పూజా హెగ్డే పొట్టి పొట్టి దుస్తులతో తన గ్లామర్ ను అందించేలా కనిపిస్తోంది. ఈ పాట చివర్లో వరుణ్ తేజ్ ఈ సినిమాలోని తన పాత్రకు తగ్గట్టుగా నటితో పాడుతూ ప్రేక్షకులను బాగా నవ్వించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకి ట్యూన్ కంపోజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: