అక్కినేని హీరోలు అన్నతో చేసిన హీరోయిన్ తమ్ముడితో.. తమ్ముడితో చేసిన హీరోయిన్ అన్నతో చేఏస్తూ వస్తున్నారు. ఆల్రెడీ నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసిన పూజా హెగ్దే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. పూజా హెగ్దే క్రేజ్ కూడా బ్యాచిలర్ సినిమా హిట్ కు కారణమని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అఖిల్ చేస్తున్న ఏజెంట్ సినిమాలో ముంబై మోడల్ కం టీవీ యాక్ట్రెస్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఏజెంట్ సినిమా ఇంకా రిలీజ్ అవకుండానే ఆమెని నాగ చైతన్య సినిమాలో సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీగా చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్న అమ్మడు ఇప్పుడు సెకండ్ సినిమా ఛాన్స్ కూడా అక్కినేని హీరోదే అందుకోవడం విశేషం. ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా మొదటి రెండు సినిమాలు అక్కినేని హీరోలతోనే చేసింది.

నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ ను సినిమాలో నటించింది. అయితే ఆ రెండు సినిమాల వల్ల తను పాపులర్ కాకపోయినా అక్కినేని హీరోలతో ఎంట్రీ ఇస్తే ఆ సెంటిమెంట్ తో కెరియర్ మాత్రం సక్సెస్ అవుతుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అందుకే అమ్మడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హిట్ అందుకుంది. ఆ హిట్ తో నిధి అగర్వాల్ క్రేజ్ కూడా పెరిగింది. మొత్తానికి ఇప్పుడు అఖిల్, నాగ చైతన్య ఇద్దరు సాక్షి వైద్యతో జోడీ కడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: