శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. యూఎస్ లో పెరిగిన ఈ అమ్మడు కన్నడ లో కిస్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అక్కడే రెండు సినిమాలు చేయగా కె.రాఘవేంద్ర రావు దృష్టిలో పడ్డది. గౌరీ రోనంకి డైరక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో అమ్మడి నటనకు అందరు ఫిదా అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ధమాకా సినిమాలో శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో కూడా అమ్మడు ఛాన్స్ పట్టేసింది. ఇదే కాదు వారాహి చలన చిత్ర వారు చేస్తున్న బైలింగ్వల్ మూవీలో కూడా శ్రీలీల సెలెక్ట్ అయ్యింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు అందులో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో కూడా శ్రీలీల లక్కీ ఛాన్స్ అందుకుంది.

ఇదే కాకుండా లేటెస్ట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కొడా జోడీ కడుతుంది అమ్మడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో శ్రీలీల నటిస్తుంది. వరుసగా క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడికి కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. చేసిన ఫస్ట్ మూవీ పెళ్లి సందడి కూడా ఓ మోస్తారుగా మాత్రమే ఆడింది. అయితే ఫస్ట్ సినిమా ఆడకపోయినా అమ్మడికి ఇన్ని ఛాన్సులు వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా సరే శ్రీలీల తెలుగు కెరియర్ దూసుకెళ్తుందని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమాలన్ని ఆమె కెరియర్ గ్రాఫ్ కి ఉపయోగపడుతుందని అర్ధమవుతుంది. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న శ్రీలీలని చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: