టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయిన నాగ చైతన్య తాజాగా లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ తో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీ లో మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించగా , బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. 

మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా లాల్ సింగ్ చడ్డా మూవీ లోని నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ లో  నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  మరి నాగ చైతన్య 'లాల్ సింగ్ చడ్డా' మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో నాగ చైతన్య ఏ రేంజ్ క్రేజ్ ని సంపాదించు కుంటాడో చూడాలి.  

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తెలుగు లో తాజాగా థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా , రాశి ఖన్నామూవీ లో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. జులై 22 వ తేదీన విడుదల ఈ మూవీ ని చేయబో తున్నారు. ఇలా నాగ చైతన్య అతి తక్కువ కాలంలోనే ఒక తెలుగు సినిమా మరి ఒక హిందీ మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: