తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమఖైదీ, అల్లరి పోలీస్, తోడికోడలు, బావబామ్మర్ది వంటి సినిమాలను నటించి మెప్పించింది అలనాటినటి మాలశ్రీ. కేవలం హీరోయిన్ గా కాకుండా అని లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 1990వ సంవత్సరంలో కనడ సినీ పరిశ్రమ టాప్ హీరోయిన్గా పేర్కొంది. తెలుగులో పాటు తమిళంలో కూడా పలు భాషలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె కూతురు రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తాను కన్నడ నాట చాలెంజింగ్ స్టార్ గా పేరుపొందిన హీరో దర్శన్ తో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగాయి.

బెంగళూరులోని శ్రీ రవి శంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ చిత్రం ప్రారంభమైనట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా  వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్.. తన ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా తరుణ్ సుధీర్ రచన దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఒకేసారి అన్ని భాషలలో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన మాలశ్రీ తనను ఆదరించినట్లుగానే తన కూతుర్ని కూడా ఆదరిస్తారని అందరు ప్రేమాభిమానాలు చూపిస్తారని రాథనా రామ్ కు శుభాకాంక్షలు తెలిపింది.


ఇక ఆమెకు మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలి అని రాక్ లైన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో తన కూతురు సిల్వర్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇస్తున్నదని తెలియజేసింది. చిన్న వయసు నుంచి తన కూతురు నది కావాలనుకుంటుంది ఇందుకోసం ముంబైలో ప్రత్యేకంగా నటన డాన్స్ శిక్షణలో కూడా నేర్పించాను సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని తన చాలా ఏళ్ల నుంచి కష్టపడుతుంది అని తెలియజేసింది. ఇక మాల శ్రీ భర్త రాము గత ఎడారి కరోనాతో మరణించారు. మరి ఈ ముద్దుగుమ్మ ఏ వేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: