వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కు ఊహించని రీతిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బింబిసార సినిమా. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక ఓపెన్ సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు కేవలం మొదటి రోజు ఏకంగా ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. కళ్యాణ్రామ్ నట విశ్వరూపం కి ప్రేక్షకులు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పాలి. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే కళ్యాణ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ టేకింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార  సినిమా ముందుగా ఒక హీరో రిజెక్ట్ చేశాడట.


 సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరోకు రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకోవడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బిందుసార విషయంలో కూడా ఇదే జరిగిందట. ముందుగా బింబిసారుడు కథను వేరే హీరోకి వినిపించగా ఆయన నో చెప్పాడట. ఆ హీరో  ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. ముందుగా ఈ కథతో దర్శకుడు వశిష్ఠ రవితేజను సంప్రదించారట. అయితే ఈ కథ రవితేజకు కూడా తెగ నచ్చేసిందట. ఈ క్రమంలోనే మొదట్లో సినిమా చేద్దామని చెప్పిన రవితేజ ఆ తర్వాత బిజీగా ఉండడంతో ఈ సినిమా గురించి అంతగా పట్టించుకోలేదట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో రాజు పాత్రలో హీరో కనిపించాల్సి ఉంటుంది. ఇక ఆ పాత్రలో నటిస్తే ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేస్తారో లేదో అని రవితేజ అనుకున్నాడట. ఈ క్రమంలోనే ఇక రవితేజ సినిమా చేయకుండా సైలెంట్ అయిపోయారట. కాగా ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ వశిష్ట చివరికి కళ్యాణ్ రామ్ కు కథ వినిపించగా తెగ నచ్చేసిందట. దీంతో కళ్యాణ్ రామ్ తో ఇక ఈ సినిమా కథను ముందుకు తీసుకువెళ్లాలని భావించాడు దర్శకుడు వశిష్ఠ. ఇక తాను అనుకున్న విధంగా ఇప్పుడు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి హిట్టు కొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: