ఇటీవల పెళ్లాడిన నయనతార, విగ్నేష్ శివన్ హనీమూన్ ఇంకా పూర్తయినట్లు కనిపించడం లేదు.అయితే ఈ జంటకు కాస్త గ్యాప్ దొరికితే ప్రైవసీ కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు.  ఇదిలావుంటే ఇక తాజాగా వీరిద్దరూ కలిసి తాము విదేశాలకు వెళుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.పోతే  దర్శకుడు విగ్నేష్ శివన్ తన భార్య హీరోయిన్ నయనతారతో కలిసి స్పెయిన్ లోని బార్సిలో నాకు ఒక వెకేషన్ కి వెళ్తున్నట్లుగా ప్రకటించారు.ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో విమానంలో తాను నయనతార కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ''పని పని పని అవిశ్రాంతంగా పనిచేసిన తర్వాత మేము కొంత సమయం గడపడానికి వెళుతున్నాము, 

బార్సిలోనా మేము వచ్చేస్తున్నాము'' అంటూ పేర్కొన్నారు. అయితే నిజానికి ఇటీవల చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్ ప్రారంభ అలాగే ముగింపు వేడుకలను భారీ ఎత్తున గ్రాండ్గా జరిపించాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. ఇక అందులో విగ్నేష్ శివన్ కూడా ఒక కీలకమైన సభ్యుడిగా ఉన్నారు.ఇదిలావుంటే ఇక కొన్ని వారాలుగా ఈ విషయం కోసమే ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.  ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈవెంట్ ను విజయవంతం చేయడంలో అనేక ప్రశంసలు అందుకున్న విగ్నేష్ శివన్ ఇప్పుడు వెకేషన్ మోడ్ లోకి వెళ్లారు. అయితే నిజానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ ముగింపు వేడుకలలో ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరగడానికి...

 విగ్నేష్ శివన్ కూడా ఒక కారణమని ప్రస్తావించారు. ఇకపోతే అన్నట్టు వీరిద్దరి వివాహ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే వీరి వివాహానికి సంబంధించి ఒక చిన్న టీజర్ లాగా విడుదల చేసి త్వరలోనే వీరి వివాహ వేడుకను నెట్ఫ్లిక్స్ లో చూస్తారంటూ కామెంట్ చేసింది.అయితే మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోతే మరికొద్ది రోజులలో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లిని కూడా మనం నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా చూసినట్టు చూడబోతున్నాము. ఇక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తరహాలో ఈ పెళ్లిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే భారీ విజువల్స్ తో ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయే విధంగా పెళ్లిని షూట్ చేశారని అంటున్నారు. కాగా ఈ పెళ్లి మొత్తం షూటింగ్ అంతా కూడా గౌతమ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిందని తెలుస్తోంది..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: