టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరనే విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారట.


నేను బాగా షూటింగ్ ను ఎంజాయ్ చేసిన సినిమా ఆర్య అని హార్ట్ కు టచ్ అయిన సినిమా బొమ్మరిల్లు అని ఆయన తెలిపారు. నేను వయస్సులో పెద్ద అయినా సుకుమార్, బన్నీతో ఎంజాయ్ చేశానని ఆయన అన్నారట.


ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశానని నేను, ప్రభాస్ కొట్టుకునే వాళ్లమని దిల్ రాజు చెప్పుకొచ్చారు. బొమ్మరిల్లు హార్ట్ కు బాగా దగ్గరైన సినిమా ప్రేక్షకులకు ఎంతో నచ్చిన సినిమా అని ఆయన కామెంట్లు చేశారు. ఆర్య సినిమాలో ఒక సన్నివేశం షూట్ సమయంలో సుకుమార్ నీళ్లలో పడ్డారని ఆయన చెప్పుకొచ్చారట. ఆర్యలో ఒక సీన్ లో వాటర్ ఫాల్ దగ్గర గుడిసె సెట్ వేశామని అక్కడ బన్నీ నేను స్విమ్మింగ్ చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు.


నేను స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చానని బన్నీ మాత్రం బయటకు రావడం లేదని దిల్ రాజు అన్నారట..


  నేను ఆ సమయంలో టెన్షన్ పడ్డానని ఆ తర్వాత బన్నీ కూల్ గా వాటర్ లో నుంచి బయటకు వస్తే నువ్వు హీరో నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావని అడిగానని దిల్ రాజు కామెంట్లు చేశారు. దిల్ రాజు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో చరణ్ శంకర్ కాంబో మూవీ, విజయ్ వంశి పైడిపల్లి కాంబో మూవీ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ సినిమాలతో దిల్ రాజు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: