రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆది పురుష్' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా ,  కృతి సనన్ ఈ మూవీ లో హీరోయిన్ పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ లో అత్యధికంగా వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ఉండడంతో ఈ మూవీ నుండి  చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు.

మూవీ నుండి అక్టోబర్ 2 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ను విడుదల చేయబోతుంది.  ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతుంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించింది. అందులో భాగంగా సోనాల్ చౌహాన్ తాజాగా ఆది పురుష్ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

సోనాల్ చౌహాన్ తాజాగా మాట్లాడుతూ ...  ఆది పురుష్ సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పు కొచ్చింది. ఇలాంటి మూవీ చేయడం అంటే హిస్టరీ లో ఒక భాగం అయినట్లే అని సోనాల్ చౌహాన్ పేర్కొంది. ప్రొడక్షన్ హౌస్ నుండి కాల్ రాగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసానని సోనాల్ చౌహాన్ చెప్పు కొచ్చింది. ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పరంగా ఆది పురుష్ మూవీ ట్రెండ్ సెట్ చేస్తుందని సోనాల్ చౌహన్ తెలిపింది. ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు సోనాల్ చౌహన్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: