కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.ఈయనకు తమిళ్ లో ఉన్న మార్కెట్ ఇతర భాషల్లో లేదు.. కోలీవుడ్ లో వందల కోట్లు కలెక్ట్ చేసిన పక్క భాషల్లో మాత్రం 10 కోట్లు రాబట్టడం కూడా సాధ్యం కాదు. తెలుగు హీరోలు మాత్రం సునాయాసంగా పక్క భాషల్లో కూడా కోట్ల రూపాయలు రాబడుతూ వీరికి సవాల్ విసురుతున్నారు.. 

ఇక ఈ నేపథ్యంలో తమిళ్ స్టార్స్ కూడా ఈ మధ్యనే పాన్ ఇండియా సినిమాలపై ద్రుష్టి పెట్టారు. అందులో విజయ్ కూడా ఉన్నాడు.అయితే  ఈయనకు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు టాక్..ఇక అది కూడా భారీ బడ్జెట్ తో అని తెలుస్తుంది. వీరిద్దరూ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాయి.ఇప్పుడు వీరి కాంబోలో ఏకంగా రూ 300 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట.అయితే  అట్లీ తన సన్నిహితుల దగ్గర ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినట్టు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ఈ న్యూస్ మారిపోయింది.

కాగా ఈయన స్క్రిప్ట్ రెడీ చేసి విజయ్ కు చూపిస్తాను అని చెప్పాడట.ఇకపోతే  తమిళ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించేందుకు సిద్ధం అయ్యిందట.ఇదిలావుంటే  ప్రెజెంట్ వీరిద్దరూ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.. విజయ్ వారసుడు సినిమాతో పాటు, లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయబోతున్నాడు.  అట్లీ కూడా షారుఖ్ ఖాన్, నయనతారతో జవాన్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే  మరి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఓకే అయితే వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: