యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కున్నాడు . ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను మరియు ఒక మోషన్ పోస్టర్ నీ కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ,  అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు.

మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే కొరటాల శివ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను మరియు ఒక పోస్టర్ నీ కూడా చిత్ర బృందం విడుదల చేసింది. 

మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 31 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ,  ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఒక అదిరిపోయే కీలక పాత్ర ఉందని ఆ పాత్రలో చియాన్ విక్రమ్ ని తీసుకోవాలి అనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు అందుకు తగిన సన్నాహాలను కూడా చిత్ర బృందం చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: