తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది రష్మిక. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల కాలంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక స్టార్ హీరోయిన్లకు పోటీగా సినిమాలలో నటిస్తూ ఉంటూ బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ స్థాయిలో సక్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఒక సినిమా ఫ్లాప్ అయిన వెంటనే మరొక సినిమాతో సక్సెస్ అయ్యి మంచి విజయాలను అందుకుంటోంది రష్మిక.


ఇ ఏడాది శర్వానంద్ తో తీసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా డిజాస్టర్ కాక ఆ తరువాత సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. రష్మిక చేతిలో ఇప్పుడు పలు ప్రాజెక్టులు ఉన్నాయి అయితే ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో మొదటి సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నది. పుష్ప సినిమాతో ఆల్రెడీ సక్సెస్ అయినప్పటికీ.. సోలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతోంది.ఇక దీంతో బాలీవుడ్లో మరికొన్ని ఆఫర్లు అందుకోవాలని చూస్తున్నది రష్మిక. అలా అమితాబచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

అయితే ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదని చెప్పవచ్చు. కానీ రష్మిక ప్రమోషన్ లో మాత్రం కాస్త హడావిడిగా కనిపించిన ఈ చిత్రంలో అమితా బచ్చన్ నటించడంతో రష్మికకు కలిసొస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక రష్మిక తన మొదటి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యిందంటే ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్ గా మారిపోతుందని చెప్పవచ్చు. పుష్ప -2 సినిమా కూడా బాలీవుడ్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది అలాగే వారసుడు సినిమాతో పాటు రణబీర్ కపూర్ తో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఖచ్చితంగా ఒక సినిమా అయితే సక్సెస్ కావాల్సి ఉంది రష్మికకు.

మరింత సమాచారం తెలుసుకోండి: