ఈ మధ్య విశ్వక్ సేన్ నటుడిగా బాగా డెవలప్ అయ్యాడు.. ఎంచుకుని కథల విషయంలోనూ పరిణితి చూపిస్తూ హిట్ కొరుకుతున్నాడు. విశ్వక్ లాస్ట్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం కూడా డీసెంట్ హిట్ ను సాధించి ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మరియు ట్రైలర్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా థ్రిల్ చేశాయి. రేపు ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కానుంది. పైగా ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తుండడంతో మరింత ఆసక్తి కలిగింది.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ అదే ఫలితాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇందులో విశ్వక్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ పాగల్ హీరో హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు.