

ఇప్పటికే కాజోల్ కూతురు కోసం సినిమా కథలను కూడా వింటోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరో అయినా హీరోయిన్స్ అయినప్పటికీ కెరియర్లో తొలి చిత్రానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్టార్ బ్యాగ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ హీరోయిన్ మీద మరింత ఫోకస్ ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే నైసా కోసం పలు కథలు వింటోంది ఈమె తల్లి. ఇక అజయ్ దేవగన్ కూడా హీరోగా పలు సినిమాలు చేస్తే బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వారసురాలు ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు మరి ఇప్పుడు నైసా కూడా అదే దారిలో వెళ్లి సత్తా చాటాలని చూస్తోందట. ముఖ్యంగా జాన్వి, అనన్య పాండే, సారా అలీఖాన్ తదితరులు కూడా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ కూతురుగా తన మీద ప్రెషర్ ఉన్నా సరే తన టాలెంట్ గా అందరిని మెప్పించడానికి సిద్ధమవుతోంది నైసా. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.