కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో డబ్ చేసి , విడుదల చేసి , టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు. కార్తీ "యుగానికి ఒక్కడు" మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తరువాత ఆవారా , నా పేరు శివ , ఖాకీ ,  ఖైదీ ,  తాజాగా విడుదల అయిన సర్దార్ మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా కార్తీ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ తాజాగా నటించిన సర్దార్ మూవీ కి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా , రాసి కన్నా , రాజేష విజయన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ లో కార్తీ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో సీక్రెట్స్ స్పై ఏజెంట్ గా కనిపించగా ,  కార్తీ మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇది ఇలా ఉంటే సర్దార్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న కార్తీ తాజాగా జపాన్ అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే లాంచనంగా స్టార్ట్ అయింది. 

మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , అను ఇమాన్యుయల్ ఈ మూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జపాన్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కార్తీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కార్తీ ఎరుపు రంగు డ్రెస్ ను వేసుకొని సోఫాలో పడుకొని ఉన్నాడు. అలాగే గోడపై కార్తీ ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: