హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన కెరీర్ సీరియస్ గానే తీసుకున్న నాని ఓ పక్క హిట్ లాంటి సస్పెన్స్ మూవీస్ చేస్తూనే మరో పక్క అ!, మీట్ క్యూట్ లాంటి మూవీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన సోదరి దీప్తి గంటాని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాని చేసిన మీట్ క్యూట్ సోనీ లివ్ లో రిలీజైంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మొదలై అదే విధంగా రిలీజ్ అయ్యింది మీట్ క్యూట్. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా కానిచ్చేశారు. ఆంథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మీట్ క్యూట్ లో ఐదు కథలు ఉన్నాయి.

ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే కథలు ఎలా ఉన్నా దీప్తి డైరెక్షన్ ఓకే అనిపించింది. కాకపోతే స్లో నరేషన్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అయితే డైరక్టర్ గా మాత్రం దీప్తికి మంచి మార్కులు పడినట్టే అని చెప్పొచ్చు. నిర్మాతగా నాని కూడా మంచి సినిమానే తీశాడని ఆడియన్స్ రెస్పాన్స్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అనేది ఒక తెలివైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఇదే థియేట్రికల్ రిలీజ్ అంటే రిజల్ట్ ఎలా ఉండేదో కానీ ఓటీటీ కాబట్టి నాని మూవీ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.

అంతేకాదు నాని మూవీని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడంలో కూడా తన తెలివి తేటలు ఉపయోగించాడని చెప్పొచ్చు. నాని నిర్మాతగా కూడా ఇక్కడే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎక్కువ రిస్క్ లేకుండా పెట్టిన బడ్జెట్ మొత్తం డిజిటల్ రిలీజ్ ద్వారానే రాబట్టుకున్నాడు. ఇక శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ లాంటివి లాభాలన్నమాట. సో హీరోగానే చేస్తున్నా నిర్మాతగా కూడా బిజినెస్ ని బాగానే నేర్చుకున్నాడు నాని. ఇక నాని హీరోగా వస్తున్న దసరా మూవీ ఇంకా రంగులు అద్దుకుంటుంది. సినిమా 2023 మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. నానిసినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: