సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను కూడా ఒప్పుకోవడం లేదు. స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరిస్తుంది

సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. హీరోలకు ఉన్నంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది. అందుకే సాయిపల్లవిని లేడీ పవర్‌ స్టార్‌ అని పిలుస్తుంటారు. మిగిలిన హీరోయిన్లలా గ్లామర్‌ పాత్రలను కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ తన పాపులారిటీని అయితే మెయింటైన్‌ చేస్తోంది. చివరగా గార్గి చిత్రంతో వచ్చిన సాయిపల్లవి గురించి ఇప్పుడు ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. సాయిపల్లవి సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నట్టు వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.

చివరగా ఈ ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో వచ్చిన సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను కూడా ఒప్పుకోవడం లేదు. స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తుంది. దీంతో సాయిపల్లవి సినిమాలను వదిలేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. త్వరలోనే సాయిపల్లవి పెండ్లి చేసుకోబోతుందని.. అందుకే కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది. దీంతో కొద్దిరోజులు ఈ వార్తలు అయితే సద్దుమణిగాయి. అయితే తాజాగా మళ్లీ సాయిపల్లవి సినిమాలకు దూరంగా కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి మరో కారణం అయితే వినిపిస్తుంది.

సాయిపల్లవి డాక్టర్‌ అని అందరికీ తెలిసిన విషయమే. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించిన సాయిపల్లవి.. ఇండియా వచ్చిన తర్వాత నటిగా అయితే మారింది. మలయాళ సినిమా ప్రేమమ్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. అయితే ఇప్పుడు తాను అభ్యసించిన వైద్య వృత్తికి న్యాయం చేయాలని సాయిపల్లవి అనుకుంటుందని తెలుస్తుంది.అందుకే కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందని కూడా తెలుస్తోంది. ఈ ఆస్పత్రిని సాయిపల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతున్నారని.. అందుకే సినిమాలను వదిలేయాలని కూడా అనుకుంటున్నట్టుగా టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉన్నది తెలియాలంటే కొద్దిరోజులు అయితే ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: