సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే మొదటి మూవీ తో మంచి క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరో గా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో , డ్యాన్స్ తో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం శ్రీ లీల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే శ్రీ లీల రవితేజ సరసన ధమాకా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం శ్రీ లీల 6 సినిమాలలో నటిస్తోంది. శ్రీ లీల నటిస్తున్న ఆరు సినిమాలు ఏవో తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో శ్రీ లీల రెండవ హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

నితిన్ 32 వ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. పంజా వైష్ణవ్ తేజ్ నాలగవ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో శ్రీ లీల బాలకృష్ణ కు కూతురి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: