త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలకు ముందే వచ్చినప్పటికీ ఇప్పటికీ అఫీషియల్ గా ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే ఫిబ్రవరిలో ఈ సినిమాను లాంచ్ చేస్తామంటూ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పాడు తారక్. అయితే ఇక ఈ సినిమా ముగిసిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ సినిమాపై కూడా అటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి నటుడిని అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా వాడుకోబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఈ రెండు సినిమాలు ముగిసిన తర్వాత మరో సెన్సేషనల్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట.  ఆ దర్శకుడు ఎవరో కాదు వెట్రిమారన్. సొసైటీలో జరిగే విషయాలను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో వెట్రిమారన్ దిట్ట అని చెప్పాలి. అతని మేకింగ్ కి ఇప్పటికే నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఒక చిన్న సినిమాను ఏకంగా ఆస్కార్ వరకు కూడా వెట్రిమరన్ తీసుకొని వెళ్ళాడు.


 ఇక అలాంటి దర్శకుడు తో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ లాంటి ఒక వర్సటైల్ యాక్టర్ అందరిలా కాకుండా భిన్నమైన సినిమాలు తీసే వెట్రిమారన్ కలిస్తే ఇక ఆడియన్స్ ఊహకందని రీతిలో సినిమా ఉండబోతుంది అనడంలో సందేహం లేదు అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు ఆస్కార్ అవార్డు దక్కుతుందనుకున్నప్పటికీ అలా జరగలేదు. కానీ వెట్రిమారన్ తో సినిమా అంటే ఎన్టీఆర్కు ఆస్కార్ ఖాయమని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: