తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు .

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ హీరో బింబిసారా అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ విజయంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ లో హీరో గా నటించాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆవరేజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "డెవిల్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ 500 మందితో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై అభిషేక్ నామా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: