
ఒకప్పుడు మహానటి సావిత్రి తర్వాత ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్గా సౌందర్య నిలిచింది అని చెప్పాలి. ఇక ఆమె ఇండస్ట్రీకి దూరమై 19 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ ఆమె రూపం ప్రేక్షకుల మదిలో అలాగే ఉంది అని చెప్పాలి. అయితే విమాన ప్రమాదంలో సౌందర్య అకాల మరణం చెందారు అన్న విషయం తెలిసిందే. అయితే సౌందర్య 2004లో చనిపోతుంది అన్న విషయం ఆమె తండ్రికి ముందుగానే తెలుసట. సౌందర్య తండ్రి సత్యనారాయణకు అప్పట్లో జాతకాల పట్టింపు ఎక్కువగా ఉండేదట.
ఈ క్రమంలోనే ఒక జ్యోతిష్యుడికి ఆమె జాతకం చూపిస్తే ఆమె ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారట. ఇక అనుకున్నట్లుగానే ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆమెకు ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడం.. ఆ తర్వాత తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా ఎదగడం జరిగింది. అదే సమయంలో 2004లో సౌందర్య కెరియర్ ముగుస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట. ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుందేమో అనుకున్నాము.. కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ నటుడు చిట్టిబాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.