బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల లో ఒకరైన ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే

రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతుండ గా ప్రియాంక మాట్లాడుతూ తనకు ఎదురైన కష్టాలకు సంబంధించి షాకింగ్ విషయాలను అయితే వెల్లడించారు. అమెరికాకు వెళ్లిన కొత్తలో హైస్కూల్ ఎడ్యుకేషన్ కోసం తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె అన్నారు. అక్కడివారితో ఎలా ఫ్రెండ్ షిప్ చేయాలో కూడా మొదట నాకు అర్థం కాలేదని ఆమె కామెంట్లు చేశారు. ఆ తర్వాత రోజుల్లో భయాలను పక్కన పెట్టి ఈ స్థాయికి చేరుకున్నానని కూడా ఆమె వెల్లడించారు. అమెరికాకు వెళ్లిన సమయంలో క్యాంటీన్ కు వెళ్లి ఫుడ్ ఎలా అడగాలో కూడా నాకు తెలియదని వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకుని ఎవరూ చూడకుండా బాత్ రూమ్ కు వెళ్లి మరీ ఆహారం తినేదానినని ప్రియాంక కామెంట్లు చేశారు.

అలా ఆహారం తీసుకున్న తర్వాత క్లాస్ రూమ్ కు వెళ్లిపోయేదాని నని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చాలారోజుల పాటు నేను వేరేవాళ్లతో కలిసి తిరగలేదని కూడా ప్రియాంక చోప్రా అన్నారు. నాకున్న భయం వల్లే ఆ సమయంలో నేను అలా చేశానని కూడా ఆమె పేర్కొన్నారు. నాలుగు వారాల పాటు అక్కడ ఉండి ప్రతి విషయాన్ని కూడా నేను గమనించానని ప్రియాంక చోప్రా కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నాలో ధైర్యం పెరగడంతో స్కూల్ లో ఉన్న ఇతర పిల్లలతో ఫ్రెండ్ షిప్ ను మొదలుపెట్టానని ఆమె తెలిపారు. లేట్ నైట్ పార్టీలకు, డేట్ కు మా ఇంట్లో అనుమతించరని ఫ్రెండ్స్ కు అర్థం అయ్యేలా అయితే చెప్పానని ప్రియాంక చోప్రా కామెంట్లు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సిటాడెల్ లో ప్రియాంక చోప్రా నటనకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: