సుడిగాలి సుదీర్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా సాదాసీదా కంటెస్టెంట్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇక తర్వాత ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు.  ఇక జబర్దస్త్ తోనే తన కెరీయర్ని సరిపెట్టుకోకుండా వెండితెరపై కూడా ఛాన్సులు దక్కించుకున్నాడు. చిన్నచితక పాత్రలు చేసిన సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారాడు. 2019లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.


 అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఇక వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సుడిగాలి సుదీర్. అయితే గత ఏడాది విడుదలైన గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ఈ సినిమా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఇక కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా హిట్ కావడంతో సుడిగాలి సుదీర్ సుడి ఒక్కసారిగా తిరిగిపోయింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరుస ఆఫర్లు ఈ జబర్దస్త్ కమెడియన్ వెంట క్యూ కడుతున్నాయి.


 అయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటుగానే రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక సుడిగాలి సుదీర్ గాలోడు హిట్ తర్వాత రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేశాడు అన్నది తెలుస్తుంది. మొన్నటి వరకు లక్షల్లో ఉన్న సుధీర్ పారితోషకం ఇక ఇప్పుడు కోట్లలోకి చేరిపోయింది. ఏకంగా ఒక్కో సినిమాకి సుధీర్ రెండు కోట్లకు పైగానే పారితోషకం డిమాండ్ చేస్తున్నాడని.. ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక సుధీర్ హీరోగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: