సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మహేష్ బాబు నటించిన గత నాలుగు సినిమాలను చూసుకుంటే గనక అందులో ఏదో ఒక మెసేజ్ ఉంది. ఇక ఆ సినిమాలో విలన్స్ ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు మహేష్ బాబు. అంతేకాదు మరొక సినిమా విషయానికి వస్తే అతని సినిమాల్లో ఒక పెద్ద కంపెనీ ఆ కంపెనీలో ఒక సమస్య మరోపక్క ఓ పెద్ద ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కూడా మరొక సమస్య ఈ రెండు సమస్యలను తీర్చడానికి హీరో ఆ పెద్ద ఫ్యామిలీ వద్దకు వెళ్లడం ఇలా ఒక ఫామ్ లో మహేష్ బాబు సినిమా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా ఎలా చేశారు...  

వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కూడా గతంలో విరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా లాగా నే ఉంటుందని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం గ్లిమ్ప్స్ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతోందో చెప్పక్కర్లేదు. ఈ వీడియోని బట్టి చూస్తే ఈ సినిమా పక్క మాస్ సినిమా అని భావన అందరిలో కలుగుతుంది. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా కూడా మహేష్ బాబు గత సినిమాల మాదిరిగానే ఫ్యామిలీ సినిమా అన్న మాటలు వినబడుతున్నాయి. కాకపోతే ఈ సినిమా విలేజ్ నేపథ్యంలో సాగే ఒక మాస్ ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు.

 కాకపోతే ఎవరికి ఆ డౌట్ రాకుండా త్రివిక్రమ్ ముందుగా మిర్చి ఘాటుని చూపించాడని అంటున్నారు. గుంటూరు కారం ఎంతకారంగా ఉంటుందో ఈ గ్లిమ్స్ వీడియో ద్వారా చూపించాడు త్రివిక్రమ్. అయితే మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9న కూడా మరొక రుచి చూపిస్తాడట త్రివిక్రమ్. అంతేకాదు ట్రైలర్ లో స్వీట్ అంటే ఎలా ఉంటుందో దానితోపాటు కొన్ని ఫ్యామిలీ అంశాలను కూడా రివిల్ చేస్తారట చిత్ర బృందం. ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో దాదాపుగా 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా వస్తోంది.ఇన్ని ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాతో మహేష్ త్రివిక్రమ్ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటారా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: