కానీ ఈమధ్య అమ్మడు మరీ డైటింగ్ చేస్తున్నట్టు ఉంది మరీ బక్క పలచగా మారింది. అనుపమ అంటే ఇష్టం ఉన్న అభిమానులు సైతం అమ్మడు ఇక తగ్గింది చాలు కాస్త బాగా తిని కాస్త్ కండ పెంచు అంటున్నారు. జీరో సైజ్ మోజులో అనుపమ తన అసలు రూపాన్ని మిస్ చేసుకుంటుందని అంటున్నా వారు ఉన్నారు. అయితే నెటిజెన్ల కామెంట్స్ అసలేమాత్రం పట్టించుకోని అనుపమ వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. సినిమాలే కాదు అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటో షూట్స్ లో కూడా అనుపమ స్లిం లుక్ చూసి బాబోయ్ అనుపమ ఇంత ఘోరంగా ఉందేంటి అంటున్నారు.
మరి తగ్గించింది చాలు కానీ అనుపమ ఇప్పుడున్న లుక్ తో కొద్దిగా బొద్దుగా మారితే బాగుంటుంది అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా అనుపమ అటు సినిమాలు ఇటు ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది. సినిమాలు వస్తున్నాయి కాబట్టి తన లుక్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్న అనుపమ ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ విన్న తర్వాత తన డెసిషన్ మార్చుకుంటుందో లేదా ఇదే కొనసాగిస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా అనుపమ పరమేశ్వరన్ కెరీర్ మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి