ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దూకుడు సినిమా కూడా ఒకటి. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దాంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. ఆ సమయంలో దూకుడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేసింది.
అయితే దూకుడు తర్వాత వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలోనే ఆగడు అనే సినిమా చేశారు.అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆగడు సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దూకుడు లాంటి భారీ విజయం తర్వాత వచ్చిన ఆగడు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ఆగడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం తెలిపారు. మహేష్ బాబు ఫ్యాన్స్ దూకుడు తర్వాత మాస్ సినిమా కావాలని అడిగారు.
కానీ నాది ఆ స్టైల్ కాదు. ఆగడు సినిమాను సల్మాన్ ఖాన్ టైగర్ జిందహై అనే సినిమా నుంచి ఇన్స్పెర్ అయ్యి తీశాను అని తెలిపారు. అయితే ఆగడు మూవీ తెరకెక్కించిన నిర్మాతలు అప్పటికే ఓ పెద్ద ఫ్లాప్ వచ్చింది. దాంతో వాళ్ళు మహేష్ సినిమాను సింపుల్ గా చేయాలని అన్నారు.రురల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయమని చెప్పారు. నేను కూడా మహేష్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బయటపెట్టాలని బ్రెత్ లెస్ డైలాగ్స్ కూడా రాశాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. కానీ ఇవేం వర్కౌట్ కాలేదు. కానీ మహేష్ బాబు దీని పై నన్ను బ్లేమ్ చేయలేదు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా మహేష్ నాతో అలానే ఉన్నారు అని చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి