సెప్టెంబర్లో మొదలుపెట్టి మళ్ళీ వచ్చే ఏడాది జనవరి వరకు శ్రీ లీల సినిమాలే రాబోతున్నాయి. అన్ని సినిమాలు ఒక్కో పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్నాయి. అయితే కేవలం పండుగ మారుతుంది హీరో మారుతున్నారు తప్ప శ్రీ లీలా మాత్రం కామన్ గానే ఉండబోతోంది. సెప్టెంబర్ లో రామ్ తో కలిసి నటించిన స్కంద సినిమా వినాయక చవితికి సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. ఇక అక్టోబర్ 19న బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతోంది.. నవంబర్లో వైష్ణవ తేజ్ తో కలిసి నటించిన ఆదికేశవ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ఇదే కాకుండా ఈ ఏడాది చివరిలో నితిన్ నటించిన సినిమా కూడా విడుదల కాబోతోంది. దీంతో వచ్చే యేడాది జనవరి వరకు శ్రీ లీల హవానే కొనసాగబోతుంది. ఇక సంక్రాంతికి అంటే వచ్చే ఏడాది గుంటూరు కారం అనే మహేష్ సినిమా విడుదల కాబోతోంది. ఇలా దాదాపుగా 5 నెలలలో ఈ అమ్మడి సినిమాలే విడుదల కాబోతున్నాయి. కేవలం హీరోలు మాత్రమే చేంజ్ అవుతున్నారని, పలువురు నేటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి