టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ గత సంవత్సరం ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా ఈ టాలెంటెడ్ హీరో గత ఏడాది టైం లైన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకొని తాజాగా మరో మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35 వ సినిమాని తెరకెక్కించబోతున్నారు.

Sharwa 35 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ విభాగంలో చివరి దశకు చేరుకుంది.  ఇప్పుడు మిగిలిన షూటింగ్ను ఎక్కడ నిర్వహించబోతున్నారు అని అభిమానుల సైతం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈ సినిమా మిగిలిన షూటింగ్ ను కొడైకెనాల్ లోని పూంపరై లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఇక మిగిలిన షెడ్యూల్ ని పూర్తి చేసి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంచ బోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా నుంచి ఇటీవలే ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.

ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.  ఇక మూవీ టైటిల్ తో పాటు టీజర్, ఈవెంట్లకు సంబంధించిన అప్డేట్లను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మనమే అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు రాగా..  ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  పాపులర్ బ్యానర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: