బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషం మన అందరికీ తెలిసిందే. గత కొంత కాలం వరుస అపజయాలు రావడంతో సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న షారుక్ ఈ సంవత్సరం పఠాన్ అనే మూవీ తో భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా పటాన్ మూవీ సూపర్ సక్సెస్ ను సాధించడంతో అదే జోష్ లో షారుక్ , అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

సినిమా కూడా సూపర్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకొని ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇలా రెండు వరుస 1000 కోట్ల సినిమాల తర్వాత షారుక్ "డాంకీ" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. ఆ తర్వాత ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనితో ప్రభాస్ , షారుక్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: