స్టార్ హీరోయిన్ నిత్యామేనన్ టైటిల్ రోల్ లో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ 'కుమారి శ్రీమతి'.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్ సిరీస్‌ ను గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించారు. ఈ వెబ్‌ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్నస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.ఈ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్‌ పరిటాల, వీకే నరేష్‌, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీ మోహన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, నటుడు మరియు దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్‌ స్పెషల్‌ రోల్స్‌లో ఎంతగానో సందడి చేశారు. 

టీజర్ మరియు ట్రైలర్ తో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ గురువారం (సెప్టెంబర్‌ 28) నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.  ఆకట్టుకునే కథ కథనాలు, కామెడీ, యాక్షన్ మరియు ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను బాగా ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిత్య మేనన్ తన అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో లో టాప్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తమ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కుమారి శ్రీమతి టీమ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. తాత కట్టించిన ఇంటిని దక్కించుకోవడానికి ఎంతగానో ఆరాట పడుతూ ఉంటుంది సిరి అలియాస్‌ శ్రీమతి ( నిత్యా మేనన్‌). ఇందుకోసం బాబాయితో న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది. అయితే 38 లక్షలు కడితనే ఇల్లు దక్కుతుందని కోర్టు ఆదేశించడంతో బార్‌ను ఓపెన్‌ చేస్తుంది. మరి ఓ మహిళ బార్‌ను ఏ విధంగా నిర్వహించింది..ఈ ప్రయత్నం లో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేది కథ. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: